గుండె ఆరోగ్యానికి జిమ్, యోగా రెండూ అవసరమేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జిమ్ వ్యాయామాలు గుండెను బలపరచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తే, యోగా ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసిక ప్రశాంతతను అందిస్తుందంటన్నారు. కేవలం యోగాపైనే ఆధారపడకుండా ఏరోబిక్ వ్యాయామాలు, శక్తి శిక్షణ, యోగా, స్ట్రెచింగ్‌ను సమతుల్యంగా చేయడం ఉత్తమం అని అంటున్నారు. వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.