ఆర్థిక వ్యవహారాలపై గవర్నర్‌కు బొత్స లేఖ

1558చూసినవారు
ఆర్థిక వ్యవహారాలపై గవర్నర్‌కు బొత్స లేఖ
AP: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రభుత్వం తప్పుడు సమాచారం అందిస్తోందని, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లో పారదర్శకత లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయని, ఆఫ్-బడ్జెట్ అప్పులు కూడా అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్నందున తక్షణ చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. ఈ లేఖతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మరింత వేడెక్కనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్