తాటి ముంజలు కోస్తూ విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

8358చూసినవారు
తాటి ముంజలు కోస్తూ విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి
TG: సూర్యాపేట జిల్లా పెన్‌ప‌హాడ్ మండ‌లం గాజుల మల్కాపురం గ్రామంలో విషాదం నెలకొంది. 8వ తరగతి విద్యార్థి నిఖిల్(14) ఐరన్ పైపుతో తాటి ముంజలు కోస్తుండగా.. హై టెన్షన్ కరెంట్ వైర్‌కు తగలడంతో షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో నిఖిల్ స్నేహితుడు మణికంఠకు గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. నిఖిల్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్