జమ్మూలోని శ్రీనగర్‌లోక్రాల్‌పోరా ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. వీధి కుక్కలు దాడి చేయడంతో వాటి నుండి తప్పించుకోవడానికి ఒక చిన్నారి ప్రాణభయంతో రోడ్డుపైకి పరుగులు తీశాడు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఒక వాహనం ఆ బాలుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.