బాలుడికి అరుదైన వ్యాధి.. రూ.16 కోట్ల ఇంజెక్షన్ కావాలి

20434చూసినవారు
AP: కాకినాడ గ్రామీణ మండలం గంగనాపల్లికి చెందిన కోసూరి బాలాజీ, హెమియా దంపతుల కుమారుడు మోజెస్‌ రాయ్(4) అరుదైన కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్-2తో బాధపడుతున్న మోజెస్ రాజ్‌ను శాంతినగర్‌లోని విహాన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. చికిత్సకు నెలకు రూ.50 వేలు ఖర్చు అవుతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ వ్యాధి నివారణకు రూ.16 కోట్ల విలువైన జోల్‌జెస్మా ఇంజెక్షన్ చేయాలని వైద్యులు సూచించారని చెప్పారు.

సంబంధిత పోస్ట్