మార్చి 21న చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో జరిగిన ఒక బహిరంగ నృత్య ప్రదర్శనలో, యూనిట్రీ రోబోటిక్స్ తయారు చేసిన జీ1 హ్యూమనాయిడ్ రోబోట్ ప్రమాదవశాత్తు ఒక చిన్న బాలుడి ముఖానికి తగిలింది. సుమారు 35 కేజీల బరువున్న ఈ రోబో ధర 13500 డాలర్లు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోబోల తయారీ, వినియోగంలో సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని, పూర్తిగా పరీక్షించిన తర్వాతే వినియోగానికి ఉపయోగించాలని సూచనలు వెలువడుతున్నాయి. గతంలో రష్యాలోనూ ఇలాంటి రోబో ప్రదర్శనలో ప్రమాదం జరిగింది.