తల్లి మందలింపుతో 50 కి.మీ. సైకిల్‌పై పారిపోయిన బాలుడు

7841చూసినవారు
తల్లి మందలింపుతో 50 కి.మీ. సైకిల్‌పై పారిపోయిన బాలుడు
TG: తల్లి మందలించిందనే మనస్తాపంతో ఓ బాలుడు(14) ఇంటి నుంచి పారిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించి కామారెడ్డి సమీపంలోని టేక్రియాల్‌ జంక్షన్‌కు చేరుకున్నాడు. అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణిస్తున్న బాలుడిని గమనించిన దేవునిపల్లి పోలీసులు ఆపి, అసలు విషయం తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని, బాలుడిని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్