టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు పేరుగాంచిన దర్శకుడు బోయపాటి శ్రీను, ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల 'అఖండ తాండవం' ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, బోయపాటి తదుపరి ప్రాజెక్ట్ పై అందరి దృష్టి నెలకొంది. మొదట బాలకృష్ణతో సినిమా అనుకున్నా, అది వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, బోయపాటి తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ యంగ్ స్టార్ రణవీర్ సింగ్‌తో చేయాలని యోచిస్తున్నారు.