AP: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ
పరీక్షలు జూన్ 5తో ముగియనున్నాయి. అనంతరం సమాధాన పత్రాల మూల్యాంకనం 12 వారాల పాటు కొనసాగి, జూన్ 18 తరువాత జూన్ 20లోపు
ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. మరోవైపు, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ఈఏపీసెట్ విద్యార్థులకు, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో, సప్లిమెంటరీ
ఫలితాలు వెలువడిన తర్వాతే ఈఏపీసెట్
ఫలితాలు వెల్లడించాలని ప్రభుత్వం నిర్ణయించింది.