ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


గుడ్‌ న్యూస్.. రాజమండ్రి-తిరుపతి మధ్య విమాన సర్వీసు ప్రారంభం
Oct 01, 2025, 08:10 IST/

గుడ్‌ న్యూస్.. రాజమండ్రి-తిరుపతి మధ్య విమాన సర్వీసు ప్రారంభం

Oct 01, 2025, 08:10 IST
AP: రాజమండ్రి నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి రాజమండ్రికి కొత్త విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు. అలయన్స్ ఎయిర్ ఆధ్వర్యంలో మంగళ, గురు, శనివారాల్లో వారానికి మూడు రోజులు ఈ సర్వీసులు నడపబడతాయి. తొలి విమానం తిరుపతి నుంచి ఉదయం 7:40కు బయలుదేరి 9:25కు రాజమండ్రి చేరుకుంది. రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో మరిన్ని విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తామని, బెంగళూరుకు అదనపు విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.