దేశవ్యాప్తంగా సర్కారు బడుల్లో బ్రేక్ ఫాస్ట్

1110చూసినవారు
దేశవ్యాప్తంగా సర్కారు బడుల్లో బ్రేక్ ఫాస్ట్
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం పోషణ్ పథకాన్ని విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం 1 నుండి 8వ తరగతి వరకు మాత్రమే అమలులో ఉన్న ఈ పథకాన్ని 9 నుండి ఇంటర్మీడియట్ వరకు విస్తరించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. తెలంగాణలో ఇప్పటికే పదో తరగతి వరకు మధ్యాహ్న భోజనం అందిస్తుండగా, ఈ విద్యా సంవత్సరం నుంచే అల్పాహారంతో పాటు ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్