విశాఖలో బ్రిక్స్‌ సైకిల్‌ ర్యాలీ

4042చూసినవారు
విశాఖలో బ్రిక్స్‌ సైకిల్‌ ర్యాలీ
విశాఖ బీచ్‌ రోడ్‌లో బ్రిక్స్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన ఫ్రెండ్‌షిప్ సైకిల్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధులు, ఏపీ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. వారు సైకిల్ తొక్కి క్రీడాకారులు, యువతను ఉత్సాహపరిచారు. పలు దేశాల నుంచి విచ్చేసిన క్రీడా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్