బ్రిటన్‌కు చెందిన 42 ఏళ్ల లౌరి డెన్మాన్ అనే మహిళ మెదడులో 38 పరాన్నజీవులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీనిని 'న్యూరోసిస్టిసెర్కోసిస్' అనే అరుదైన వ్యాధిగా నిర్ధారించారు. పంది టేప్‌వార్మ్ వల్ల వచ్చే ఈ వ్యాధి మూర్ఛకు ప్రధాన కారణమని తెలిపారు. 2007లో భారత్‌లో రెండు నెలల పర్యటన సమయంలోనే ఈ ఇన్‌ఫెక్షన్ సోకి ఉంటుందని లౌరి భావిస్తోంది.
భారత్ నుంచి తిరిగి వచ్చిన నాలుగేళ్ల తర్వాత, 2011లో ఆమె అస్వస్థతకు గురైంది. MRI స్కాన్‌లో మెదడులో 38 పరాన్నజీవుల తిత్తులు ఉన్నట్లు తేలింది. పంది మాంసం తినడం వల్లే కాకుండా, టేప్‌వార్మ్ గుడ్లు కలుషితమైన ఆహారం, నీటి ద్వారా కూడా సంక్రమిస్తుందని నిపుణులు తెలిపారు.