అన్నమయ్య జిల్లా బోయకొండ యానాదిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. తమ్ముడు వేట కొడవలితో అక్కపై దాడి చేయడంతో గంగులమ్మ పరిస్థితి విషమంగా మారింది. ఈ దాడిలో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి, ఎడమ చేతి బొటనవేలు తెగిపోయింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.