క్యాన్సర్‌తో తమ్ముడు మృతి.. బాధతో చనిపోయిన అన్న

15012చూసినవారు
క్యాన్సర్‌తో తమ్ముడు మృతి.. బాధతో చనిపోయిన అన్న
పంజాబ్‌లోని లుధియానా జిల్లా సమ్రాలా సమీపంలోని భంగ్లాన్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. 45 ఏళ్ల గుర్దీప్ సింగ్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో మృతి చెందగా, తమ్ముడి మరణ వార్తను తట్టుకోలేక అన్న గుర్జిత్ సింగ్ గుండెపోటుతో మరణించారు. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగిన ఈ అన్నదమ్ములు, ఒకే రోజు ఒకే ఇంటి అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి వ్యవసాయం, వ్యాపారం చేశారు. ఇద్దరి అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించడంతో గ్రామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

సంబంధిత పోస్ట్