AP: చెల్లెలిని నిత్యం అనుమానిస్తూ.. వేధిస్తున్నాడని సొంత బావనే బావమరిది కడతేర్చాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. లేపాక్షి(M) వెంకటాపురానికి చెందిన రాజు అనే వ్యక్తి చెల్లెలు మేఘనకు 11 నెలల క్రితం ఎలహంకకు చెందిన వినయ్‌తో వివాహమైంది. వినయ్, మేఘన బెంగళూరులోని ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్య మేఘనపై వినయ్ అనుమానం పెంచుకుని వేధించేవాడు. విషయం తెలుసుకున్న రాజు.. వినయ్‌ను వెంకటాపురానికి పిలిపించాడు. హంద్రీనీవా కాలువ వద్ద వినయ్‌ని చంపి కాలువలో పడేశాడు.