సీఎం రేవంత్ రెడ్డికి కేశినేని నాని బహిరంగ లేఖ

4828చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డికి కేశినేని నాని బహిరంగ లేఖ
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ శివార్లలోని వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు చిన్ని ప్రయత్నిస్తున్నారని, ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా బహిరంగ లేఖ రాశారు. ఈ భూకబ్జా యత్నాన్ని తక్షణమే అడ్డుకోవాలని నాని డిమాండ్ చేశారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్