చెల్లిని వేధిస్తున్నాడని బావను చంపేసిన బావమరుదులు

6025చూసినవారు
చెల్లిని వేధిస్తున్నాడని బావను చంపేసిన బావమరుదులు
TG: హైదరాబాద్ గోల్కొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ చెల్లిని వేధిస్తున్నాడనే ఆగ్రహంతో ఇద్దరు బావమరుదులు బావను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కుమ్మర్‌వాడీకి చెందిన షేక్ మెహబూబ్ (26) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ యూట్యూబర్‌గా కూడా గుర్తింపు పొందాడు. 2025లో రుక్సాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రుక్సా సోదరుడు సోహేల్, అతని బంధువు జాబేర్ శుక్రవారం మెహబూబ్ ఇంటికి వెళ్లి తలపై ఇనుపరాడ్‌తో దాడి చేసి, కత్తితో పొడిచారు. తీవ్ర గాయాలతో మెహబూబ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్