AP: ద్వారకాతిరుమల చిన్న వెంకన్న గోశాలలో గోవులకు బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకినట్లు కలకలం రేగింది. ఇటీవల గోశాలలో గోవులకు తరచూ గర్భస్రావం జరగడంతో దేవస్థానం
పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో బ్రూసెల్లోసిస్ వ్యాధి వెలుగులోకి వచ్చింది. మొత్తం 358 గోవులకు పరీక్ష చేయగా, 71 గోవులకు ఈ వ్యాధి నిర్ధారణ అయింది. వ్యాధి సోకిన గోవులను వేరు చేసి ప్రత్యేకంగా సంరక్షణ, మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు.