AP: కర్నూలు జిల్లాలో ‘బ్రూసెల్లోసిస్’ వ్యాధి కలకలం రేపుతోంది. ఎమ్మిగనూరు మండలం బనవాసి ఘనీకృత వీర్య కేంద్రంలోని 8 పశువులకు ఈ ప్రమాదకర వ్యాధి సోకినట్లు అధికారులు నిర్ధారించారు. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కూలీలకు కూడా వ్యాధి పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు అప్రమత్తమై బాధిత పశువులను ప్రత్యేక షెడ్డుకు తరలించారు. కూలీలను విధులకు దూరంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు.