రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా మవై గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రోజూ తన ఇంటి ముందు నిలబడటంపై నిలదీసినందుకు గీతా దేవి (55) అనే మహిళను ఆమె పొరుగింటి వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.