TG: సిద్దిపేట జిల్లాలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి చెందిన సత్తయ్య అనే వ్యక్తి తన 35 ఏళ్ల కొడుకును, 90 ఏళ్ల తల్లిని హత్య చేసి.. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్ వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవడం, కొడుకు పెళ్లి కుదరకపోవడం వంటి కుటుంబ కలహాలు ఈ ఘాతుకానికి కారణాలని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.