జ్యూస్ పాయింట్‌లో పని చేసే యువకుడి దారుణ హత్య

18992చూసినవారు
TG: హైదరాబాద్ మెహదీపట్నం పీఎస్‌ పరిధి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. టోలిచౌకిలోని జ్యూస్ పాయింట్‌లో పనిచేస్తున్న అలం(17) అనే యువకుడికి సహోద్యోగితో గొడవ జరిగింది. ఈ క్రమంలో అతడిని తోటి కార్మికుడు గరిటెతో కొట్టి చంపాడు. నిందితుడు తయ్యాబ్‌ను మెహదీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గొడవకుగల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్