కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో తాజాగా దారుణ ఘటన జరిగింది. దేవదుర్గ తాలూకా సుంకేశ్వరహాళ్ వద్ద దళిత యువ నేత భూమానంద (32) దారుణ హత్యకు గురయ్యారు. బుల్లెట్ బైక్‌పై వెళ్తున్న ఆయనను అడ్డుకున్న గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. మాదిగ సామాజిక వర్గ హక్కుల కోసం పోరాడుతున్న భూమానంద హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వ్యక్తిగత కక్షల వల్లే హత్య జరిగిందని పోలీసులు భావిస్తుండగా, నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు ధర్నాకు దిగాయి.