మర్మాంగాలు కత్తిరించి యువకుడి దారుణ హత్య

1చూసినవారు
మర్మాంగాలు కత్తిరించి యువకుడి దారుణ హత్య
AP: నరసరావుపేట పట్టణంలోని కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్‌లో తాపీమేస్త్రి గాసి రాజేష్‌ (35) దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సేవించి కాంప్లెక్స్‌లో నిద్రిస్తున్న రాజేష్‌ను గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి, ఆపై కత్తెరతో మర్మాంగాలను కోసి పైశాచికంగా హత్య చేశారు. ఒకటో పట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. రాత్రి పది గంటల వరకు సీసీటీవీల్లో కనిపించిన రాజేష్‌పై ఒంటిగంట నుంచి రెండింటి మధ్య దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్