రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివారులో న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురయ్యారు. పొలం వద్ద జరిగిన ఈ ఘటనలో దుండగులు ఆమె మెడపై నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న స్వప్న హత్యపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.