మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక పోలీసు అధికారిపై కొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై వెంబడించి, నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేశారు. వ్యక్తిగత కారులో మహిళా స్నేహితురాలితో వెళ్తున్న అధికారి కారు, నిందితుల ద్విచక్ర వాహనం స్వల్పంగా ఢీకొనడంతో వివాదం చెలరేగింది. యువకులు కారును ధ్వంసం చేసి, పోలీసును బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. స్థానికులు బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా పోలీసులు 13 మంది యువకులను గుర్తించి అరెస్టు చేశారు.