బీఎస్ఎన్ఎల్ లో 120 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు

5017చూసినవారు
బీఎస్ఎన్ఎల్ లో 120 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 120 ఖాళీలు ఉన్నాయి, అందులో టెలికాం స్ట్రీమ్ లో 95, ఫైనాన్స్ స్ట్రీమ్ లో 25 ఖాళీలు ఉన్నాయి. టెలికాం స్ట్రీమ్ కు ఇంజినీరింగ్ డిగ్రీ, ఫైనాన్స్ స్ట్రీమ్ కు చార్టర్డ్ అకౌంటెన్సీ అర్హతగా పేర్కొన్నారు. దరఖాస్తులు ఆన్​లైన్ ద్వారా ఫిబ్రవరి 05 నుంచి మార్చి 07 వరకు స్వీకరించనున్నారు. అభ్యర్థుల వయోపరిమితి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పూర్తి వివరాలకు bsnl.co.in వెబ్​సైట్​ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్