AP: బీఎస్ఎన్‌ఎల్ ఇప్పుడు శక్తివంతమైన వ్యవస్థగా మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు ఫోన్ కాల్ చేయాలంటే ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. నేను సీఎం అయ్యాక టెలికాం రంగంలో సంస్కరణల గురించి అప్పటి ప్రధానులు దేవెగౌడ, గుజ్రాల్‌తో చెప్పాను. వారు అర్థం చేసుకోలేదు. ఆ తర్వాత వాజ్‌పేయికి వివరిస్తే ఒకే చెప్పారు. ఐటీలో భారత్ అగ్రగామిగా ఉందంటే నాటి సంస్కరణే పునాది’ అని చంద్రబాబు అన్నారు.