బీఎస్ఎన్ఎల్‌లో 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ

4903చూసినవారు
బీఎస్ఎన్ఎల్‌లో 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ
కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 120 ఖాళీలు ఉన్నాయి. టెలికాం విభాగంలో 95, ఫైనాన్స్ విభాగంలో 25 పోస్టులు భర్తీ చేయనున్నారు. బీఈ/బీటెక్, సీఏ/సీఎంఏ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 05.02.2026న ప్రారంభమై 07.03.2026న ముగుస్తుంది. అర్హత, వయోపరిమితి, జీతం, ఎంపిక విధానం, దరఖాస్తు రుసుము వంటి పూర్తి వివరాలు బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్