బీఎస్ఎన్ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల గడువు పొడిగింపు

7979చూసినవారు
బీఎస్ఎన్ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల గడువు పొడిగింపు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. టెలికాం విభాగంలో 95, ఫైనాన్స్ విభాగంలో 25 పోస్టులు ఉన్నాయి. ఇంజినీరింగ్, ఫైనాన్స్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టెలికాం స్ట్రీమ్ కు BE/BTech (కనీసం 60% మార్కులతో), ఫైనాన్స్ స్ట్రీమ్ కు CA లేదా CMA అర్హత ఉండాలి. వయస్సు 21 నుంచి 30 ఏళ్లు. దరఖాస్తు గడువు మార్చి 31 నుంచి ఏప్రిల్ 15కు పొడిగించారు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 15 వరకు స్వీకరిస్తారు. ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది.

సంబంధిత పోస్ట్