ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రిటైర్ అయినా మళ్లీ ఉద్యోగం

5చూసినవారు
ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రిటైర్ అయినా మళ్లీ ఉద్యోగం
AP: ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులకు పెద్ద ఊరట కల్పిస్తూ కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జీవో ఎంఎస్ నెం.45 ద్వారా రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది 2022 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయం ప్రకారం 60 ఏళ్లకు రిటైర్ అయిన అర్హులైన ఉద్యోగులను అవసరమైతే తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఉద్యోగి రిటైర్ అయిన తేదీ నుంచి తిరిగి విధుల్లో చేరిన తేదీ వరకు ఉన్న కాలాన్ని ‘అవుట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్’గా పరిగణిస్తారు. ఆ మధ్యంతర కాలానికి ఎలాంటి వేతనం లభించదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్