తమిళనాడులోని కన్యాకుమారిలో అతివేగంతో దూసుకువచ్చిన కేరళ ప్రభుత్వ బస్సు అదుపుతప్పింది. ఈ క్రమంలో ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జంటను బలంగా ఢీకొనడంతో వారు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ ఘోర ప్రమాదం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.