బస్సు - ట్రక్కు ఢీ.. నలుగురు మృతి

14809చూసినవారు
యూపీలోని మధుర సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్లీపర్ బస్సు, ట్రైలర్ ట్రక్ బలంగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 65 మంది ప్రయాణికులతో బస్సు లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్