ట్రైన్ కిందపడి వ్యాపారి మృతి.. షాకింగ్ వీడియో!

8644చూసినవారు
యూపీలోని బులంద్‌షహర్ ఖుర్జా జంక్షన్ రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ప్లాట్‌ఫారమ్‌పై ఒక కానిస్టేబుల్, మరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుండగా, అమర్ అనే వ్యక్తి హఠాత్తుగా రైల్వే ట్రాక్‌పైకి దూకాడు. అతని ప్రాణాలు కాపాడేందుకు కానిస్టేబుల్ వెంటనే ట్రాక్‌పైకి దూకి అతడిని పక్కకు లాగేందుకు ప్రయత్నించాడు. కానీ, అంతలోనే గొరఖ్‌నాథ్ ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకురావడంతో అమర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కానిస్టేబుల్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్