రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి వంటింటి చిట్కాలు ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక గ్లాసు మజ్జిగలో ఒక చెంచా సబ్జా గింజలు, చియా గింజలు కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా నియంత్రణలోకి వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సబ్జా గింజలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి, కణాలు గ్లూకోజ్‌ను త్వరగా గ్రహించేలా చేస్తాయి. భోజనం తర్వాత చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తాయి. ఊబకాయం, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ ఇవి సహకరిస్తాయి. మందులు వాడుతున్నవారు కూడా ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.