AP: మాజీ సీఎం జగన్‌పై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చందమామ కోసం మారాం చేసినట్లుగా జగన్ ప్రతిపక్ష హోదా కోసం తాపత్రయపడుతున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది. ఎమ్మెల్యేలు శాసనసభా సమావేశాలను బహిష్కరిస్తే ఆ పదవికి అర్హత లేనట్లుగా భావించాలి. అసెంబ్లీ ఉపసభాపతిగా సమావేశాలకు జగన్ రావాలని కోరుతున్నా’ అని తెలిపారు.