రాజధానిలో రెండోదశ భూసమీకరణకు క్యాబినెట్‌ ఆమోదం

16424చూసినవారు
ఏపీ రాజధాని అమరావతిలోని ఏడు గ్రామాల పరిధిలో 16,666.5 ఎకరాల భూసమీకరణకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలు పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. వైకుంఠపురం, పెదమాద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో ఈ భూసమీకరణ చేయనున్నారు. నూర్‌బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

ట్యాగ్స్ :