ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. కృష్ణా నదీ తీరంలో ‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా ఊపింది. ఏపీ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ-2025 ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మద్దువలస, ఏలేరు రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఏపీ ఏవియేషన్ పాలసీ-2026కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.