ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును కేబినెట్ హోదాలో నియమించడంపై
వైసీపీ విమర్శలు గుప్పించింది. రాష్ట్రమంత్రి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు లేఖ రాసి, ఇప్పుడు కేబినెట్ హోదాతో సరిపెట్టడంపై
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. నాగబాబును కేబినెట్ మినిస్టర్ చేస్తామని రెండేళ్లుగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఈ పదవిపై
నాగబాబు ఇప్పటివరకు స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. పరిశీలకులు ఈ నియామకాన్ని బుజ్జగింపు చర్యగా భావిస్తున్నారు.