నీట్ ప్రశ్నపత్రం మళ్లీ లీకైందన్న వార్తలను PIB ఫ్యాక్ట్ చెక్ కొట్టిపారేసింది. కొందరు నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని
విద్యార్థులు, తల్లిదండ్రులను కోరింది.
నీట్ పరీక్షకు సంబంధించి అధికారిక సమాచారం కోసం neet.nta.nic.in వెబ్‌సైట్‌ను చెక్ చేయాలంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనుమానాస్పద కంటెంట్ ఉంటే వాట్సాప్ నం.8799711259, factcheck@pib.gov.inను సంప్రదించాలని సూచించింది.