AP: సీఎం చంద్రబాబు రాజీనామాకు సిద్ధమయ్యారని, ఆయన కుమారుడు లోకేశ్ ఏపీకి చెందిన 16 మంది ఎంపీలతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. జాతీయ స్థాయిలో ఇది ఒక పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై టీడీపీ స్పందించింది. ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చింది. కాగా, ఈ ప్రచారం వెనుక ఎవరున్నారనే విషయంపై టీడీపీ ఫోకస్ పెట్టింది.