‘నువ్వైనా జానూ ఆచూకీ చూపించమ్మా’.. పెంపుడు కుక్క వద్ద విలపించిన తల్లి

3101చూసినవారు
‘నువ్వైనా జానూ ఆచూకీ చూపించమ్మా’.. పెంపుడు కుక్క వద్ద విలపించిన తల్లి
AP: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాడ పరిధి సీహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో ఈ నెల 6న జ్ఞానేశ్వరి (2) అనే బాలిక అదృశ్యమైన విషయం తెలిసిందే. బాలిక ఆచూకీ ఇంకా తెలియకపోవడం మిస్టరీగా మారింది. అయితే బాలిక వెంట వెళ్లిన పెంపుడు కుక్క ఇటీవల ఇంటికి తిరిగి వచ్చింది. ఆ పెంపుడు కుక్కను పట్టుకుని జ్ఞానేశ్వరి తల్లి.. ‘జానూ దగ్గరకు వెళ్లావా అమ్మ. నా బిడ్డను తీసుకువచ్చేస్తావా. నువ్వైనా జానూ ఆచూకీ చూపించమ్మా’ అంటూ రోదించిన తీరు అందరినీ కలచివేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్