సదరం స్లాట్ల బుకింగ్స్‌కు ఫీజుల రద్దు..!

53చూసినవారు
సదరం స్లాట్ల బుకింగ్స్‌కు ఫీజుల రద్దు..!
ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల కోసం 'సదరం' కింద స్లాట్ల బుకింగ్ ఈనెల 14వ తేదీన పునఃప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటివరకు స్లాట్ బుకింగ్‌కు రూ.40, సర్టిఫికెట్ ముద్రణకు రూ.40 చొప్పున ఫీజులు వసూలు చేసేవారు. దివ్యాంగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇకపై ఈ ఫీజులు తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం దివ్యాంగులకు ఎంతో మేలు చేకూరుస్తుంది.

సంబంధిత పోస్ట్