AP: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న పందిరి సోమవారం అర్థరాత్రి ప్రమాదవశాత్తు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. వినాయక నిమజ్జనం ఊరేగింపులో బాణాసంచా కాల్చడం వల్లే మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.