AP: అమరావతి నిర్మాణ పనులపై శుక్రవారం సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు తప్పక పాటించాలని సూచించారు. ప్రతి 15 రోజులకోసారి పనుల పురోగతిని సమీక్షిస్తానన్నారు. పెండింగ్‌లో ఉన్న 2,471 రిటర్నబుల్ ప్లాట్లను త్వరగా రిజిస్ట్రేషన్ చేయాలని, రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దని స్పష్టం చేశారు.