కారు, లారీ ఢీ.. ఇద్దరు స్పాట్‌డెడ్ (వీడియో)

212చూసినవారు
AP: నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అనంతసాగరం మండలం ముస్తాపురం వద్ద హైవేపై కారు, లారీ ఢీకొన్నాయి. ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతిచెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో ఆత్మకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్