బ్రిడ్జి పిల్లర్‌పైకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి (వీడియో)

29422చూసినవారు
హిమాచల్‌ప్రదేశ్‌లోని అటల్ టన్నెల్ వద్ద షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. మనాలి నుంచి లాహౌల్ వెళ్తున్న స్కార్పియో కారు అదుపుతప్పి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పిల్లర్‌పైకి దూసుకెళ్లింది. దాంతో ఇనుప రాడ్లు కారులో చొచ్చుకుపోయాయి. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన కైలాష్ (34) మృతి చెందగా.. ఆదిత్య, రాజేంద్ర అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. టన్నెల్ ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చిన కారు.. టర్నింగ్ పాయింట్ వద్ద అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్‌పైకి దూసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్