ఆటోను ఢీకొట్టిన కారు.. ఆరుగురికి గాయాలు

29చూసినవారు
ఆటోను ఢీకొట్టిన కారు.. ఆరుగురికి గాయాలు
AP: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఆటో కిర్లంపూడి నుంచి దుర్గాడ వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్