ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

1583చూసినవారు
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
AP: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం శేషాపురం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్